"director is the captain of the ship"
ఈ వాఖ్యాన్ని చాలా మంది దర్శకులు చాలా సందర్భాల్లో చెప్పారు ,కానీ ఆ దర్శకులే పడవని ముంచేస్తున్నారు.గత ఏడాది కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయ్యాయి ,కాని మూడు సినిమాలు విజయాన్ని సాదించాయి .ఎన్నో అంచనాలతో పెద్ద హీరోల సినిమాలు మన ముందు కొచ్చాయి ,ఒక్క పెద్ద హీరో సినిమా కూడా కనీసం average హిట్ కూడా అవ్వలేకపోయాయి .దీనికి ప్రధాన కారణం దర్శకుల చెత్త దర్శకత్వమే .ఒకరు హీరోని ఏకంగా దేవుడు చేస్తే,ఇంకొకరు హీరోని ముఖ్యమంత్రిని చేసారు.ఏ కథని ఎలా తీయాలో తెలియని దర్శకులు మన ఇండుస్త్రి లో ఉన్నారనేది వాస్తవం .ఇప్పుడున్న దర్శకుల్లో చాలా మంది పది,పదిహేను సంవస్తరాల అనుబవం ఉన్న వాళ్ళు ఉన్నారు.కాని ప్రేక్షకుడికి ఎం కావాలో వీళ్ళు పసి గట్ట లేకపొతున్నారు.ఐతే గత ఏడాది విజయం సాధించిన సింహ,బృందావనం సినిమాలలో కొత్తదనం ఉందని మనం అనలేం.పూర్వపు సినిమాలు అన్నీ జల్లడ చేసి మన ముందుకు తీసుకోచారు .ఒక వైపు క్రిష్ లాంటి దర్శకుల సినిమాలని మంచి సినిమాలని వేరే దర్శకులు అంటున్నా ప్రేక్షకులు మాత్రం మంచి సినిమాని తీస్తే ఎందుకు చూడం అని ప్రశ్నిస్తున్నారు .అసలు మంచి సినిమా అంటే ఏంటనేది దర్శకుల ప్రశ్న అయితే ,మాకు ఆహ్లాదాన్ని పంచె ఏ సినిమా అయినా మంచి సినిమా అని ప్రేక్షకులు అంటున్నారు.మొత్తానికి హిందీ సినిమా industry లో ఉన్న గొప్ప దర్శకులు మన తెలుగు industry లో లేరనేది వాస్తవం.ఎంత సేపు హీరో ఎంత మందిని నరికితే అంత హిట్ అవుతుందని దర్శకులు బావిస్తున్నారు.పెద్ద పెద్ద dialouges ,foreign locations,heroine అంద చందాలు ,వీటితో సినిమాని నడిపిడ్డామనుకుంటే అది దర్శకుల బ్రమే అవుతుంది.