Saturday, December 11, 2010
mega family ki "MAA" astram.
మెగా స్టార్ "చిరంజీవి "- కోట్లాది అభిమానులు సంపాదించుకుని ,గత పదేళ్లుగా నo.1హీరో గా వెలుగొందుతున్న కథానాయకుడు .ఆయన ఇమేజ్ ని క్యాష్ చేసుకుని తమ్ముడు పవన్ కళ్యాణ్ ,కొడుకు రామ్ చరణ్ తేజ ,మేనల్లుడు అల్లు అర్జున్ సిని రంగ ప్రవేశం చేసారు.ఐతే ఈ మధ్య ఆయన రాజకీయాలు మీద మక్కువ పెంచుకోవటం తో సినిమాలకి స్వస్తి చెప్పారు.ఆయన తర్వాత , సిని ఇండస్త్రి మీద పట్టు పెంచుకోవడానికి కుమారుడ్ని రేస్ లో దించాడు .మొదటి సినిమా "చిరుత", బాక్స్ ఆఫీసు దెగ్గర బోల్తా పడటం తో ఆయనగారి ఆక్టింగ్ మీద సందేహాలు వఖ్తమయ్యాయి,అయితే మామ అల్లు అరవింద్ ఎత్తుగద తో టాప్ డైరెక్టర్ రాజమౌళి ని సినిమా చేయడానికి ఒప్పించారు ,అద్బుతమైన గ్రాఫిక్ వర్క్ తో ,అంతకుమించిన స్క్రీన్ ప్లే తో రాజమౌళి "మగధీర "సినిమా ని తెలుగు సిని పరిశ్రమలో ఎన్నడు లేని వసూళ్లను తెప్పించారు .అయితే మెగా ఫ్యామిలీ కి ఒక అస్త్రం ఉంది ,అది "మా"టీవి ,వీళ్ళ ఫ్యామిలీ సినిమాలు రిలీజ్ టైం అప్పుడు వద్దు మొర్రో అనేంత వరకు ఆ సినిమా కు సంభందించిన ప్రోగ్రామ్లు టెలికాస్ట్ చేసి తల నొప్పి తెప్పిస్తారు.ఆ చానెల్" మగధీర" సినిమా కి చేసిన ప్రచారం అంతా ఇంత కాదు,రోజుకి కనీసం రెండు ప్రోగ్రములైన టెలికాస్ట్ చేసేవారు.దీని వళ్ళ టీవీ చూసే ప్రేక్షకుల్లో curiosity పెరిగి సినిమా వసూళ్ళకు సహఖరించాయి .ఇది సినిమా వాసూల్లు పెంచుకోవడానికి లేటెస్ట్ అస్త్రం.మనకు తెలిసిన ఛానల్ నైన ,లేక మన సొంత ఛానల్ నైన అడ్డుపెట్టుకుని వసూళ్లు సాదించడం ఇప్పుడు షరా మామూలయిపాయింది .ఆ ఛానళ్ళు ఉన్నంత కాలం సిని హీరోల సినిమాలకి వసూళ్ళ పరంగా ఈ ఇబ్బంది ఉండదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment