Wednesday, December 15, 2010

best logic "less"movie-"leader".





ప్రముఖ నిర్మాత ,దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు మనవడు రానా దగ్గుబాటి మొదటిసారి హీరోగా నటించిన చిత్రం "లీడర్" .ఈ చిత్రానికి avm productions నిర్మించగా ,శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు .రిచా,ప్రియ ఆనంద్ హీరోయిన్ లుగా నటించారు.ఈ సినిమా ఫెబృఅరి 19న  విడుదలయింది.రిలీజ్ కాక ముందు నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి.మిక్కీ.జే మేయర్ అందించిన సంగీతం  హిట్ అవ్వడం తో అంచనాలు మరింత పెరిగాయి.దానికి తోడు ప్రకాష్ రాజ్ లాంటి నటులు అదనపు ప్రచారం అందించారు.దీంతో ఈ సినిమా పొడిచేస్తుందని  ప్రేక్షకులు అనుకున్నారు.అయితే సినిమా చూసాక అసలు విషయం తెలిసింది.ఆ సినిమా లో పస లేదని.ఈ సినిమా కథ లోకొస్తే సంజీవయ్య ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  హత్య కి గురవుతాడు.ఆయన చివరి కోరిక ప్రకారం అతని కుమారుడు అర్జున్ ప్రసాద్ (రానా)ముఖ్య మంత్రి అవ్వాలనుకుంటాడు.అందుకోసం .mla లను డబ్బులిచ్చి తన కాబినెట్ లో చేర్చుదాం అనుకుంటాడు,దానికి తోడు హీరో బందువైన సుబ్బరాజు కూడా ముఖ్య మంత్రి అవ్వాలనుకుంటాడు.హీరో ఇవ్వనిటిని ఎలా అధికమిస్తాడు అనేది స్టొరీ .అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల సమాజాన్ని ఉద్దరించే సినిమా తీద్దామనుకుని చాల పొరపాట్లు చేసాడు.ముఖ్య మంత్రి పదవిని చిన్న పిల్లలు ఆడుకునే కుర్చీ లాట చేసాడు.హీరో తల్లి కోట ని ముఖ్య మంత్రి  పదవి తన కొడుక్కి ఇవ్వమనంగానే కోట అదేదో కొబ్బరి కాయ ఇచినట్టు ఇచ్చేస్తాడు.అది గాక టీవీ ల్లో వార్తలు చెప్పే సీన్ లు కామెడీ సీన్ ని తలపిస్తాయి.హీరో ముఖ్య మంత్రి పదవి వదిలేసి కొత్త పార్టీ కి ప్రచారం  చేసే సీన్ లు,మరీ సీరియల్ లో సీన్ లలా ఉన్నాయి.వార్తలు చెప్పే రిపోర్టర్లు హీరో చేసే ప్రచారం చూసి అక్కడినుంచే మద్దతు తెలుపుతారు.మొత్తానికి లీడర్ సినిమా ని లాజిక్ లెస్స్ మూవీ గా అనుకోవచు.

No comments:

Post a Comment